గణేష్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

నగర శివార్లకే పరిమితం కానున్న అంతర్రాష్ట్ర బస్సులు

హైదరాబాద్: బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయిలలో పోలీసు సిబ్బంది భద్రత కల్గించనున్నారన్నారు.

ప్రతి క్రేన్‌ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక పోలీసు అధికారి ఉంటారన్నారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.  

నిమజ్జనం సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. శనివారం అర్దరాత్రి నుంచే నగరంలోకి అంతర్రాష్ట్ర, జిల్లాల వాహనాలపై ప్రవేశాన్ని నిషేధించనున్నారు. పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షల గురించి తెలుసుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు. ఎవరికైనా సందేహాలుంటే 040-27852482, 9490598985, 9010303626 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసి బస్సులను నగర శివార్లకే పరిమితం కానున్నాయి. 

  • నల్లగొండ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎల్బీనగర్‌, వరంగల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్‌, దేవరకొండ నుంచి వచ్చే వాహనాలు సాగర్‌ రింగ్‌రోడ్డు, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను ఆరాంఘర్‌‌ వద్ద నిలిపివేయనున్నారు.    
  • బాలాపూర్ నుంచి వచ్చే శోభాయాత్ర, ఫలన్నుమా నుంచి వచ్చే శోభాయాత్రను.. చార్మినార్, అఫ్జల్గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్కు తరలింపు.
  • సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర.. ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగూడ, ముషీరాబాద్ కూడలి, హిమాయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లింపు.
  • ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర.. రామాంతపూర్, అంబర్పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా చూస్తారు.
  • దిల్ సుఖ్ నగర్, ఐఎస్ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర.. సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా తరలింపు.
  • టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర.. మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లింపు.
  • ఎర్రగడ్డ, ఎస్సార్నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర.. అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్కు చేరుకోనుంది.
మునుపటి వ్యాసం