రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌

గణేష్ నిమజ్జనం సందర్భంగా మూత

హైద‌రాబాద్: గణేష్ నిమజ్జనం ఉన్న సందర్భంగా నగరంలో రేపు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నగరంలోని మూడు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో ఈ నెల 19, 20వ తేదీల్లో మ‌ద్యం దుకాణాలు బంద్ ఉండ‌నున్నాయి. గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో వైన్స్, బార్లు, ప‌బ్‌లు మూసి ఉంటాయ‌ని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. 19వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి 20న సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు, బార్లు, ప‌బ్‌లను మూసి ఉంచ‌నున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణ యజమానులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

 

మునుపటి వ్యాసం