ఆదాయపు పన్ను వలలో సోనూసూద్

20 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించిన ఐటీ అధికారులు

హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరో అయిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ తాజాగా చిక్కుల్లో పడ్డాడు. 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ట్టు ఆదాయపు పన్ను అధికారులు నిర్ధారించారు. సోనూ నివాసంలో గత మూడు రోజుల పాటు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విష‌యం తెలిసిందే.

సోనూసూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూష‌న్ చ‌ట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు స‌మీక‌రించిందని ఐటీశాఖ చెప్పింది. న‌టుడికి సంబంధించిన నివాసాలు, అత‌ని అసోసియేట్స్ ఇళ్లు, ఆఫీసుల్లో నిర్వ‌హించిన త‌నిఖీలు ప‌న్ను ఎగ‌వేత‌కు చెందిన అనేక ప‌త్రాలు దొరికిన‌ట్టు ఐటీశాఖ తెలిపింది.

అయితే రాజ‌కీయ క‌క్ష‌తోనే సోనూ సూద్‌పై ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. అతను దిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను క‌లిసి, దేశ్ కా మెంటార్స్ కార్య‌క్ర‌మానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే సోనూ నివాసంపై ఐటీ దాడుల జ‌ర‌గ‌డంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మునుపటి వ్యాసం