పరిషత్ ఎన్నికల్లో విజేతలకు పవన్ కళ్యాన్ అభినందన

ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని వెల్లడి

అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారని పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన అభ్యర్థులకు కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలను జనసేన కైవసం చేసుకుందన్నారు. ఈ ఫలితాలపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని ఆయన తెలిపారు. పరిషత్ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందన్నారు. 

మునుపటి వ్యాసం