రాజకీయాల్లో బాధ్యతగా ఇష్టంగా వచ్చాను: పవన్

జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ వ్యాఖ్య

అమరావతి: సినిమా అంటే ఇష్టమే అయినా గత్యంతరం లేక ఇందులో వచ్చానని, కానీ రాజకీయాల్లో బాధ్యతగా ఇష్టంగా వచ్చానని హీరో, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. బుధవారం జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నటుడు అవ్వాలని తనకు కోరిక లేదని పలు సందర్భాల్లో చెప్పానని,   సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనకుందని అన్నారు.

రాజకీయాల్లో కలుపు మొక్కలను ఏరివేయాలని వచ్చానని స్పష్టం చేశారు. తనకు ఏదో మెడల్ ఇస్తారనో తాను చేయనని పవన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీకైనా, భారతీయ జనతా పార్టీకైనా తానెప్పుడు అడిగినా ఏపీ గురించే అడుగుతానన్నారు. ఏపీ కోసమే మద్దతు ఇచ్చా అని తెలిపారు. "కాట్ల కుక్కల్లా అరుస్తారేంటి.. మాట్లాడటం రాదా మీకు?.. ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి.

నేను అడుగుతున్నది ఒకరి కష్టార్జితాన్ని మీరెవరు దోచుకోవడానికి అని అడుగుతున్నానన్నారు. నేను సినిమా టికెట్ల గురించి అడిగా నాకేమైనా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ వారికే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు. ఒక్క రోడ్డయినా వేశారా? మహానుభావులకు తల వంచుతాం. మీలాంటి వారి తాట తీస్తాం. ఏదైనా అంటే అరుస్తారు.. మాట్లాడరు" అని పవన్ ప్రశ్నించారు.

మునుపటి వ్యాసం