పెట్రోల్ ట్యాంకర్ చాటున గంజాయి రవాణా

గంజాయి విలువ రూ. 90 లక్షలు పైనే

అశ్వారావుపేట: పెట్రోల్ ట్యాంకర్ చాటున గంజాయి రవాణా చేస్తున్న ఘటన ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో జరిగింది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి హైద్రాబాద్‌కు రిలయన్స్ పెట్రోల్ ట్యాంకర్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు.

దీంతో సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి ఎస్సై చంద్రశేఖర్ తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానంతో పెట్రోల్ ట్యాంకర్‌ను పరిశీలించగా ట్యాంకర్‌లో గంజాయి ప్యాకెట్లు రవాణా చేస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ట్యాంకర్ ద్వారా తరలిస్తున్న సుమారు 1.5 టన్నుల 287 ఫ్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.90 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

మునుపటి వ్యాసం