బద్వేలు ఉప ఎన్నికకు సిద్ధమైన జ‌న‌సేన‌

రెండు రోజుల్లో అభ్యర్థి ప్రకటించే అవకాశం

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో జ‌న‌సేన‌ పార్టీ బరిలోకి దిగనుంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్  విడుదల చేసిన విష‌యం తెలిసిందే. కాగా, ఈ ఎన్నిక‌లో పోటీ చేయాలని జనసేన పార్టీ యోచిస్తోంది. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విజయజ్యోతిని బరిలోకి దించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ మేర‌కు జనసేన పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు అభ్యర్థి విజయజ్యోతికి ఫోన్‌ చేసి జ‌న‌సేన తరఫున పోటీ చేయాలని అన్నారు. దీంతో స్పందించిన విజ‌య‌జ్యోతి తన మ‌ద్ద‌తుదారుల‌తో చర్చించి త్వరలో నిర్ణయాన్ని చెబుతానని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆమె రెండు రోజుల్లోగా నిర్ణయం తీసుకోనున్నారు.

విజ‌య‌ల‌క్ష్మి గతంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. విజ‌య‌ల‌క్ష్మి గతంలో 2014లో బద్వేలు నుంచే టీడీపీ త‌ర‌ఫున పోటీచేసి ఓడిపోయారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెల‌వ‌లేదు. ఇదిలా ఉండగా వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్న‌ సుధాను గెలిపించ‌డానికి ఆ పార్టీ అధిష్ఠానం ప‌లువురికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. నిన్నటి నుంచే నామినేష‌న్లు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో తొలిరోజు నవతరం పార్టీ అభ్యర్థిగా  రమేశ్‌ కుమార్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాల్ని మొదలు పెట్టారు. 

మునుపటి వ్యాసం