తెలంగాణలో అదుపులోకి కరోనా

కొత్తగా 183 మందికి కరోనా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అదుపులోకి వస్తోంది. గడిచిన 24గంటల్లో 40,354 మందికి కరోనా నమూనా పరీక్షలు చేయగా, ఆ నమూనాల్లో 183 మందికి  పాజిటివ్‌ గా తేలింది. ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,070కి చేరింది. కొత్తగా మరో ఇద్దరు కొవిడ్‌తో మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 3,932కి చేరినట్లు ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా బారి నుంచి నిన్న 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,196 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరో వైపు కేరళలో కరోనా విజృంభిస్తోంది. గత నెల రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా  6,996 కరోనా కేసులు, 84 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో 16,576 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 46,73,442కు చేరుకుంది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,01,796కు, మొత్తం మరణాల సంఖ్య 26,342కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,419 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 

మునుపటి వ్యాసం