ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్ సభ్యులందరూ రాజీనామా..!

మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు రాకుండ ఉండేందుకే నిర్ణయం

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇక​ కథ ముగిసింది అనుకుంటే మరో కొత్త కథ తెరమీదకు వచ్చింది. మా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్ సభ్యులు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. మోహన్‌ బాబు సమక్షంలో మా ఎన్నికలు జరిగాయని ఆయన అన్నారు.  తన ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులందరూ కలిసి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లో అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికే మా సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్‌ ఆలోచనలపై రకరకాల ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. మరోవైపు ఓటమికి జీర్ణించుకోలేక ఇలా కొత్త అసోసియేషన్‌ వైపు అడుగులు వేయడం ఎంత వరకు సమంజసం అంటూ ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఒకవేళ ప్రకాశ్‌రాజ్‌ కొత్త అసోసియేషన్‌ ప్రకటిస్తే టాలీవుడ్‌ రెండు వర్గాలుగా చీలిపోనుందనే టాక్‌ కూడా ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతుంది.

మునుపటి వ్యాసం