ఈటల గెలవాలని హరీష్ రావు అనుకుంటున్నారు

ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్య

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు అనుకుంటున్నారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. మంగళవారం నాడు హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట్‌లో భాజపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే 119లో 103వ ఎమ్మెల్యే అవుతారు. ఈటల రాజీనామ చేస్తేనే అభివృద్ధి చేస్తున్నారు. మొన్న నన్ను వెల్లగొట్టారన్నారు. నిన్న రాజేందర్‌ని, రేపు హరీష్ రావును టీఆర్ఎస్ నుంచి వెల్లగొడతారని ఆరోపించారు. ఈటల రాజేందర్ గెలవాలని హరీష్ రావు అనుకుంటున్నారని ఈ మాటలు తనతో పోలీసులు చెప్పారని ఆయన తెలిపారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో హరీష్ రావు తప్పుడు లెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసినప్పటి నుంచి భాజపా-తెరాస నేతలు, మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

మునుపటి వ్యాసం