తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర వెలకట్టలేనిది: ఎమ్మెల్యే

కళాకారులుగా పుట్టడం గొప్పవరమన్న వనమా వెంకటేశ్వరరావు

కొత్తగూడెం: కళాకారుడిగా పుట్టడం దేవుడిచ్చిన గొప్ప వరమని, అది అందరికీ సాధ్యం కాదని కొత్తగూడెంఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం పాల్వంచలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సమక్షంలో తెలంగాణ కళాకారుల జేఏసీ చైర్మన్‌గా జానకీరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర వెలకట్టలేనిదని, గజ్జకట్టి, గళం విప్పి తెలంగాణ ఆకాంక్షను ఎలుగెత్తి చాటి చెప్పిన ఘనత కళాకారులదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్, బీజేఏసీ చైర్మన్ గుండపనేని సతీష్, బీమా మాధవి, బీరా జయమ్మ, శ్రీనివాసరావు, ఎస్‌కే మున్నా, దివ్యాంగ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మాలోత్ జగ్గుదాస్, అబ్దుల్ నయిం, కాటి నాగేశ్వరరావు, కత్తి శ్రీను,సీహెచ్ గోవర్ధన్, ఎస్‌కే ఖాసీం, చింతల కనకయ్య, లక్ష్మీనారాయణ నాయుడు, కనకయ్య, బిక్షం దాస్, కుమార్‌లు పాల్గొన్నారు.

 

మునుపటి వ్యాసం