మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌

హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నట్లు వెల్లడి

కరీంనగర్: తెలంగాణ బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి స్వల్ప జలుబు, జ్వరం తదితర లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు జాగ్రత్తలు తీసుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని ట్వీట్ చేశారు. కొన్నిరోజులుగా ఆయన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా, మంత్రి గంగుల కరోనా బారినపడటం ఇది రెండోసారి.

మునుపటి వ్యాసం