ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు మృతి

మృతుల్లో గ్రామ పెద్ద, మైనర్ బాలుడు కలరు

ఇంఫాల్‌: ఉగ్రవాదులు పౌరులపై కాల్పులకు తెగబడిన ఘటన మణిపూర్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం... మణిపూర్ రాష్ట్రంలోని కాంగ్‌పోక్సి జిల్లా బీ గమ్మోమ్‌ ప్రాంతంలో కుకీ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎంపీ ఖుల్లెన్‌ గ్రామ పెద్ద, మరో నలుగులు మృత్త్యువాతపడ్డారు. మృతుల్లో ఓ మైనర్‌ బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. మిలిటెంట్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నామన్నారు. కాగా, గత ఆదివారం భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో నలుగురు కుకీ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు ఉగ్రవాదుల అంత్యక్రియలను గ్రామస్థులు నిర్వహిస్తుండగా మిలిటెంట్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని స్థానికులు వెల్లడించారు.

మునుపటి వ్యాసం