ఏపీపీఎస్సీ: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ

నోటిఫికేషన్ ద్వారా 38 పోస్టుల భర్తీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 పోస్టుల భర్తీ చేయనున్నారు.

అత్యధికంగా ఆర్థిక గణాంక శాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు – 29 పోస్టులు ఉండగా, సమాచార శాఖలో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ షిప్ అధికారులు -6, వైద్య ఆరోగ్య శాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారి – 1, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో హాస్టల్ వార్డెన్ -02 పోస్టులు ఉన్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజులు వంటి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఉద్యోగానికి ఎంపికైన విద్యార్థుల స్టడీ సర్టిఫికెట్ల వేరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని, దీనికి సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు ప్రకటించారు. 

మునుపటి వ్యాసం