మారుతీ కార్ల‌పై రూ.43 వేల వరకు డిస్కౌంట్లు

ఆల్టో ఎస్టీడీ వేరియంట్‌పై రూ.38 వేల వ‌ర‌కూ డిస్కౌంట్

న్యూదిల్లీ: దసరా దీపావళి పండుగల నేపథ్యంలో సుజూకీ మోటర్ కార్పోరేషన్ శుభవార్త అందించింది. మారుతీ పాపుల‌ర్ మోడల్స్ అన్నింటిపై భారీ రాయితీలు ప్ర‌క‌టించింది. ఆల్టో, ఎస్‌-ప్రెసో, వేగ‌న్ఆర్‌, స్విఫ్ట్‌, డిజైర్‌, బ్రెజా మోడ‌ల్స్‌పై అక్టోబ‌ర్ నెల‌లో ఈ డిస్కౌంట్లు ల‌భించ‌నున్నాయి. ఆల్టో కారు ఎస్టీడీ, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ప్లస్ వేరియంట్ల‌లో వ‌స్తోంది.

ఇందులో ఆల్టో ఎస్టీడీ వేరియంట్‌పై రూ.38 వేల వ‌ర‌కూ డిస్కౌంట్ ఉండ‌గా.. మిగ‌తా వేరియంట్ల‌పై రూ.43 వేల వ‌ర‌కూ రాయితీ కల్పిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. వేగ‌న్ఆర్ మోడ‌ల్‌పై రూ.17,500 వ‌ర‌కూ ఈ నెల‌లో ఆదా చేసుకోవ‌చ్చు. అదే సీఎన్జీ వేరియంట్‌పై రూ.12500 వ‌ర‌కూ డిస్కౌంట్ ఉంది. ఆల్టో సీఎన్జీ వేరియంట్‌పైనా రూ.18 వేల ఆఫ‌ర్లు ఉన్నాయి.

ఇక మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెసోపై ఈ అక్టోబ‌ర్ నెల‌లో రూ.48 వేల వ‌ర‌కూ డిస్కౌంట్లు, ఇత‌ర ఆఫ‌ర్లు ఉన్నాయి. సీఎన్జీ వేరియంట్‌పై రూ.18 వేల వ‌ర‌కూ ఇస్తున్నారు. ఇక ఇండియాలో అతి ఎక్కువ‌గా అమ్ముడైన కార్ల‌లో ఒక‌టైన మారుతీ సుజుకీ స్విఫ్ట్‌పై ఈ పండుగ పూట రూ.24500 వ‌ర‌కూ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌. అదే డిజైర్‌పై రూ.19500, విటారా బ్రెజాపై రూ.17500 వ‌ర‌కూ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

మునుపటి వ్యాసం