'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతల స్వీకరణ

పెన్షన్ల ఫైల్ పై తొలి సంతకం చేసిన మంచు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఉఠ్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రకాష్ ప్యానల్, మంచి విష్ణు ప్యానల్ లు పోటీ పడ్డాయి. కాగా మంచివిష్ణు ప్యానల్ గెలుపొందింది. ఈ మేరకు అధ్యక్షుడిగా మంచు విష్ణు బుధవారం బాధ్యతలను స్వీకరించారు.

అధ్యక్ష హోదాలో ఆయన తొలి సంతకాన్ని పెన్షన్ల ఫైల్ పై చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.... తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు అందరి మద్దతు తనకు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మరోవైపు ఇతర పదవులకు ఎన్నికైన వారి ప్రమాణస్వీకారం ఎప్పుడనే విషయం తెలియాల్సి ఉంది.

మరోవైపు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాల అంశంపై ప్రెసిడెంట్ హోదాలో మంచు విష్ణు ఎలా వ్యవహరిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులను కలుపుకుని పోతారా? లేకపోతే బైలాస్ ప్రకారం కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? అనేది వేచి చూడాలి.