లఖింపూర్‌ ఖేరీలో రైతు మృతుల విగ్రహాల ఏర్పాటు

దాదాపు కోటి రూపాయల ఖర్చుతో చనిపోయిన ఐదుగురి విగ్రహాలను ఏర్పాటు

ఘజియాబాద్‌: లఖింపూర్‌ ఖేరీ ఘటనలో మరణించిన రైతుల పేరిట స్మారకం నిర్మించేందుకు దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజిమెంట్‌ కమిటీ సిద్ధమైంది. ఘటన జరిగిన ప్రాంతంలోనే దాదాపు కోటి రూపాయల ఖర్చుతో చనిపోయిన ఐదుగురి విగ్రహాలను ఏర్పాటు చేసి వారి గురించి వివరాలు చెక్కించాలని కమిటీ నిర్ణయించినట్లు కమిటీ అధ్యక్షుడు మంజీందర్‌ సింగ్‌ సిర్సా తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో సరిగ్గా పది రోజుల క్రితం జరిగిన హింసలో ఐదుగురు రైతులు చనిపోయారు. టికునియాలో దాదాపు ఒకే చోట అమరవీర రైతుల స్మారక చిహ్నం నిర్మించనున్నామని, అక్కడ నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ అమరులయ్యారని మంజీందర్‌ సింగ్‌ సిర్సా చెప్పారు. ఇందు కోసం ఒకటిన్నర, రెండు ఎకరాల భూమి అవసరం అవుతుందని, స్థానిక భూ యజమానులతో మాట్లాడి కొనుగోలు చేస్తామన్నారు.

ఇప్పటివరకు టికునియాతోపాటు మీరట్, ఘాజీపూర్ సరిహద్దులో రైతు స్మారక చిహ్నాలను నిర్మించనున్నట్లు రైతు నేతలు ప్రకటించారు. గత ఏప్రిల్‌లో ఘాజీపూర్‌ సరిహద్దులో మేధా పాట్కర్‌తో కలిసి రాకేశ్‌ తికాయత్‌ స్మారకం నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేయడం విశేషం.

 

మునుపటి వ్యాసం