డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీలపై కేంద్రం కీలక నిర్ణయం

ఇకపై గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసిన కేంద్రం

న్యూదిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, వాహనాల అనుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ పత్రాల చెల్లుబాటు గడువును పొడిగించేందుకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఇకపై గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది.

ఈ నెలాఖరులో (అక్టోబర్‌ 31) వరకు సమయం ఇచ్చింది. ఈ నెలాఖరు తర్వాత సంబంధిత డాక్యుమెంట్లలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరి 1న ముగిసిన అన్నీ వాహన పత్రాల గడువును కేంద్రం పొడగిస్తూ వచ్చింది. కరోనా మహమ్మారి సమయంలో ఆర్టీవో కార్యాలయాల్లో రద్దీని తగ్గించి, కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌తో సహా పలు ముఖ్యమైన పత్రాల రెన్యువల్‌ గడువును పొడిగించిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం సడలింపును ఎత్తివేయాలని నిర్ణయించిన కేంద్రం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో గడువు ముగిసిన అనంతరం చట్టవిరుద్ధంగా పరిగణించనున్నారు.

కరోనా కాలంలో కేంద్రం ఇప్పటి వరకు ఎనిమిది సార్లు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తదితర పత్రాల వ్యాలిడిటీని పొడిగిస్తూ వచ్చింది. ఇందుకు మోటార్‌ వాహనాల చట్టం, 1988 అండ్‌ సెంట్రల్‌ మోటార్‌ సమయంలో, మోటార్ వాహనాల చట్టం, 1988 మరియు సెంట్రల్ మోటార్ వాహనాల నియమాలతో పాటు సంబంధిత పత్రాల చెల్లుబాటు కోసం నిబంధనలు సడలించింది.

తొలిసారిగా గతేడాది మార్చి 30 వరకు సడలింపు ఇవ్వగా ఆ తర్వాత.. జూన్ 9, 2020 వరకు, మళ్లీ ఆగస్టు 24 వరకు, అనంతరం డిసెంబర్ 27వరకు పొడిగించింది. మళ్లీ మార్చి 26 వరకు, అనంతరం ఈ ఏడాది జూన్ 17 వరకు.. మళ్లీ సెప్టెంబర్ 30వరకు, చివరిసారిగా అక్టోబర్ 31 వరకు పొడగించింది.

మునుపటి వ్యాసం