భాజపాయేతర పార్టీలకు శరద్‌ పవార్‌ పిలుపు

యూపీ ఎన్నికల్లో ఆ పార్టీని అడ్డుకునేందుకు పావులు కదుపుతున్న ఎన్సీపీ

ముంబయి: కమలం పార్టీని అడ్డుకునేందుకు భాజపాయేతర పార్టీలన్నీ కలిసి రావాలని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ శాసన సభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శరద్ పవార్ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉత్తర ప్రదేశ్-2022 ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీ పొత్తుతో పోటీ చేస్తామని ఇప్పటికే ఎన్‌సీపీ ప్రకటించింది. కాగా, ఓట్ల విభజనను సాధ్యమైనంత వరకు తగ్గించేలా చూడడం చాలా ముఖ్యమని అన్నారు. ఇందుకు బీజేపీయేతర పార్టీలు కలిసిరావాలన్నారు.

లఖింపూర్‌ ఖేరి ఘటనపై స్పందించిన ఆయన .. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయని.. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీతో సహా కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలు లక్ష్యంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు.

మునుపటి వ్యాసం