ఏసీబీకి చిక్కిన నాగోల్‌ విద్యుత్‌ అధికారి

ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్

హైదరాబాద్‌: ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో విద్యుత్‌ శాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. హైదరాబాద్‌ నగరంలోని నాగోల్‌లో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ ఏఈ మధుకర్‌ ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పనులు పూర్తయినట్లు నివేదిక ఇవ్వడానికి లంచం అడగడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో బుధవారం డబ్బులు తీసుకుంటుండగా ఏఈ మధుకర్‌ను పట్టుకున్నారు. 

 

మునుపటి వ్యాసం