తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమించారు. జుడిషియల్ అధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు.  న్యాయ మూర్తులుగా పదోన్నతి పొందిన వారిలో శ్రీ సుధా, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, తుకారం జి, వెంకటేశ్వర్ రెడ్డి, మాధవి దేవిలు ఉన్నారు.

వీరి నియామకం పై గతనెల 16న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం విధితమే.