రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ జరుపుకున్నారన్నారు. ఈ బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.