ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

శ్వాస సమస్యలు, ఛాతి నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిక

న్యూదిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా శ్వాస సమస్యలు, ఛాతి నొప్పి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.  డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని ఎయిమ్స్‌ వైద్యుల బృందం మాజీ ప్రధానికి చికిత్సలు చేస్తున్నారు. 

మన్మోహన్‌ సింగ్‌ ఈ ఏడాది ఏప్రిల్ 19న కరోనా బారినపడ్డారు. మార్చి 4న, ఏప్రిల్‌ 3న కొవిడ్‌ టీకా తీసుకున్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అయిన మన్మోహన్‌ సింగ్‌ ప్రస్తుతం రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2004-2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు.

మునుపటి వ్యాసం