దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

కొత్తగా 18 వేల కరోనా కేసులు నమోదు

న్యూదిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 15,823 కేసులు నమోదవగా, తాజాగా అవి 18 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 16 అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్‌ కేసులు 2.06 లక్షలకు తగ్గాయి. గత 215 రోజుల్లో యాక్టివ్‌ కేసులు 2 లక్షలకు తగ్గడం ఇదే మొదటిసారి.

దేశంలో కొత్తగా 18,987 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, గత 24 గంటల్లో మరో 19,808 మంది కోలుకోగా, 246 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730కు చేరింది. ఇందులో 3,33,62,709 మంది బాధితులు కోలుకోగా, 2,06,586 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,51,435 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు.

దేశవ్యాప్తంగా 34,66,347 మంది కరోనా టీకా తీసుకున్నారని వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం 96,82,20,997 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. అక్టోబర్‌ 13 నాటికి 58,76,64,525 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. ఇందులో నిన్న ఒక్కరోజే 13,01,083 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.

మునుపటి వ్యాసం