ఈ నెల 25న పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి

హైదరాబాద్: ఈనెల 25న తెరాస రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక జరుగుతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ...టీఆర్ఎస్ ఎన్నో సవాళ్లను అధిగమించిందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించామని పేర్కొన్నారు.

రైతు బంధు స్ఫూర్తితో కేంద్రం కిసాన్ పథకం తెచ్చిందన్నారు. ప్లీనరీ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభ నిర్వహణ, ఏర్పాట్లకు పార్టీ తరపున కమిటీలు ఉంటాయన్నారు. ఆహ్వాన కమిటీ, సభా వేదిక ప్రాంగణం అలంకరణకు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్, భోజన, తీర్మానాల, మీడియా కమిటీలు ఏర్పాటు చేయనున్నాయన్నారు. ప్రతినిధులకు పార్టీ తరపున గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు. ఆహ్వానం ఉన్నవారే సమావేశానికి రావాలని మంత్రి సూచించారు. 

మునుపటి వ్యాసం