మంత్రి తలసానిని కలిసిన మంచువిష్ణు

కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం

హైదరాబాద్: మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో  మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నిన్న మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు, ట్రెజరర్ శివబాలాజీ గురువారం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈనెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంచు విష్ణుకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఉఠ్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రకాష్ ప్యానల్, మంచి విష్ణు ప్యానల్ లు పోటీ పడ్డాయి. కాగా మంచివిష్ణు ప్యానల్ గెలుపొందింది. ఈ మేరకు అధ్యక్షుడిగా మంచు విష్ణు బుధవారం బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్ష హోదాలో ఆయన తొలి సంతకాన్ని పెన్షన్ల ఫైల్ పై చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ... తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు అందరి మద్దతు తనకు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.