తెరాస లో చేరిన నగరం గ్రామ భాజపా నాయకులు

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ శ్రీనివాస‌రెడ్డి

కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంట రూరల్‌ మండలం నగరం గ్రామ భాజపా నాయకులు, కార్యకర్తలు తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెరాసలో చేరిన వారిలో బుర్ర‌ సతీశ్‌, రాచమల్ల శివ, రవితోపాటు ఇరువై మంది కార్యకర్తలు ఉన్నారు. గురువారం వైస్ ఎంపీపీ పోల్సాని తిరుపతిరావు ఆధ్వర్యంలో వారు తెరాస కండువ కప్పుకున్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస‌రెడ్డి నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ…తెరాస సంక్షేమ పథ‌కాలే తెలంగాణ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథ‌కాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి నాయకున్ని, కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.

హూజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డితోపాటు తదితరులు ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.