రెవెన్యూ శాఖలో పెరుగుతున్న వసూలు రాజాలు

43 మంది అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు నివేదికలో వెల్లడి

హైదరాబాద్: రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రోజుకో వార్త వింటున్నాం. ఈ నేపథ్యంలో వసూలు రాజాలపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. అవినీతిపై విజిలెన్స్ డిపార్టుమెంట్ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు నివేదిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, చేతివాటం ప్రదర్శిస్తూ బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ, పథకాల్లో అనర్హులకు తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఏలు నగదు చెల్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 మంది రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు నివేదికలో వెల్లడించారు.