రాజ్యసభ సభ్యుడు శ్రీనివాస్ ను కలిసిన రేవంత్ రెడ్డి

మర్యాదపూర్వకంగా కలిసినట్లు వెల్లడి

నిజామాబాద్: తెరాస రాజ్యసభ సభ్యుడు ధర్మపురి  శ్రీనివాస్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే పలకరించేందుకు వచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం మర్యాద పూర్వకంగానే డీఎస్‌ను కలిసినట్లు వివరించారు. శ్రీనివాస్ కిందపడిపోగా చెయ్యి విరిగిందని, ఈ విషయం తెలిసి పరామర్శించేందుకు వచ్చానన్నారు.

ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని తెలిపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను కిందపడిపోగా చెయ్యి విరిగిందన్నారు. ఈ విషయం తెలిసిన రేవంత్ తనను పలకరించటానికి  వచ్చారన్నారు. ఇందులో రాజకీయాలు లేవన్నారు. వయస్సులో చిన్నవాడైనా... తాను కింద పడ్డానని తెలిసి వచ్చారన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి పలకరించడానికి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు. 

మునుపటి వ్యాసం