రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ చెప్పలేదు

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హరీష్‌రావు

కరీంనగర్: ఈ నెల 30న హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక  జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ ప్రచారాస్త్రాలను సంధిస్తున్నాయి. సోమవారం భారీ నీటిపారుదల, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హుజురాబాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

తెరాసను ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయన్నారు. రైతులను బీజేపీ కార్లతో తొక్కి చంపేస్తోందన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ చెప్పలేదన్నారు. రూ.291 పన్ను గ్యాస్ పై విధించినట్లు నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తానని హరీష్‌రావు సవాల్ విసిరారు. నవంబర్ 2న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉండనుంది.