వైఎస్సార్ టీపీ: రేపట్నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర

ప్రతి రోజు 12 కిలోమీటర్లు చొప్పున మొత్తం 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర

హైదరాబాద్‌: రేపటి (బుధవారం) నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించనున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు లోటస్ పాండ్‌లో ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈ తరం యువతకు నవతరం న్యాయకత్వం స్లోగన్‌తో షర్మిల పాదయాత్ర జరగనుంది.

వైఎస్ సంక్షేమ పాలన ఎజెండాగా పాదయాత్ర సాగుతుంది. ప్రతి రోజు రచ్చ బండ మాదిరిగా మాట ముచ్చట కార్యక్రమం జరుగుతుంది. చేవెళ్ళలో బుధవారం ఉదయం 11 గంటలకు షర్మిల భారీ భహిరంగ సభ అనంతరం అక్కడి నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. 14 నెలలు, 4 వేల కిలోమీటర్లు, 90 నియోజక వర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ప్రతి రోజు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ప్రతి నియోజక వర్గంలో మూడు మండలాలు టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. పాదయాత్రలో పార్టీలో చేరికలు.. గ్రామాల వారీగా పార్టీ బలోపేతంపై సమావేశాలు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా పాదయాత్రలో 9 భారీ భహిరంగ సభలు షర్మిల నిర్వహిస్తారు.