నేటి నుంచే మెట్రో సువర్ణ ఆఫర్‌

ఎంజీబీఎస్‌ - జేబీఎస్‌ - పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ల మధ్య రూ.15 టికెట్ ధర

హైదరాబాద్‌: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ శుభవార్త అందించింది. వినియోగదారులకు భారం తగ్గించేందుకు మెట్రో సువర్ణ ఆఫర్ ను ప్రకటించారు.  మెట్రో సువర్ణ ఆఫర్‌ - 2021 సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ట్రిప్‌పా‌స్‌ను మెట్రోస్టేషన్లలో పొందొచ్చు.

గ్రీన్‌ లైన్‌ (ఎంజీబీఎస్‌ - జేబీఎస్‌ - పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ల మధ్య) ప్రయాణానికి కేవలం రూ.15 టికెట్‌ ధర కూడా నేటి నుంచే అందుబాటులోకి రానుంది. నిత్యం ప్రయాణించే మార్గానికి 20 ట్రిప్పుల ధరను ముందస్తుగానే చెల్లిస్తే మరో పది ట్రిప్పులను ఉచితంగా పొందొచ్చు. ఈ సువర్ణ ఆఫర్‌-2021 వచ్చే ఏడాది జనవరి 15 వరకు మాత్రమే ఉండనుందని అధికారులు పేర్కొన్నారు. 

మునుపటి వ్యాసం