హిమాయత్‌, ఉస్మాన్‌ సాగర్‌ కు తగ్గిన వరద ఉధృతి

బస్తీలు, మురికివాడల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జంటజలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం ఈ వర్షాలు తగ్గటంతో వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం మూడు గేట్లను మూసి వేసినట్టు అధికారులు తెలిపారు. ఒక గేటు మాత్రమే 2 అడుగుల మేరకు తెరిచి నీటిని వదులుతున్నట్టు తెలిపారు. దీంతో హైదరాబాద్‌ మెట్రోవాటర్‌బోర్డు అధికారులు గేట్లను తెరిచి నీటిని మూసీలోకి విడదల చేశారు.

హిమాయత్‌ సాగర్‌పూర్తి స్థాయి నీటి మట్టం 1,763.50 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,763.45 అడుగుల మేరకు ఉందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 2.97 టీఎంసీలుకాగా ప్రస్తుతం 2.94 టీఎంసీలుఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా ఉస్మాన్‌ సాగర్‌ సైతం భారీ వరద నీరు చేరికతో జలకళ సంతరించుకుంది.

జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను రెండు ఫీట్ల మేరకు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఈ రెండు జలాశయాల నుంచి వరద నీటిని వదులుతుండడంతో మూసీలో వరద ప్రవాహం ఎక్కువగా వుంది.