టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్

క్వాలీఫయర్ మ్యాచ్ లో ఐర్లాండ్ ఘన విజయం

హైదరాబాద్: పరిమిత ఓవర్ల మ్యాచ్ లైనటువంటి టీ20 ప్రపంచ కప్ ఆదివారం మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. కాగా, అసలు సమరం ఈ నెల 23న మొదలు కానుంది. అయితే అంతకంటే ముందు పెద్ద జట్లు ప్రాక్టిస్ మ్యాచ్ లు ఆడనున్నాయి.

ఈ క్రమంలో భారత్ నేడు తన తొలి ప్రాక్టిస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఢీకొట్టబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ తీసుకుంది. ప్రాక్టిస్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ లో ఇరు జట్లలో 15 మంది ఆటగాళ్లు ఆడే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లాండ్ లు అసలైన పోటీలో వేర్వేరు గ్రూపుల్లో ఉండగా ప్రస్తుతం ప్రాక్టిస్ మ్యాచ్ లో తలపడి ఎవరి బలాలు, బలహీనతలు ఎంటో తెలుసుకోవాలనుకుంటున్నాయి. 

ఐర్లాండ్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ కేవలం 106 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ స్టిర్లింగ్ 30 పరుగులు చేయగా, డెలానీ 44 పరుగులు చేశాడు.