హరీష్‌రావుకు మిగిలేది మిత్రద్రోహి టైటిల్ మాత్రమే: రేవంత్‌రెడ్డి

కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం

హైదరాబాద్: హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్‌ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తిరుగుబాటును ఎదుర్కొనేందుకే కేసీఆర్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల చర్చ ఎందుకు తీసుకొచ్చారో కేసీఆరే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, 2022 ఆగస్టులో గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలూ జరుగుతాయని జోస్యం చెప్పారు.

మంత్రి హరీశ్ రావును కేసీఆర్ పూర్తిగా ఇంటికి పంపే ప్రణాళిక పన్నారన్నారు. మంత్రి హరీష్‌రావుకు చివరకు మిగిలేది మిత్రద్రోహి టైటిల్ మాత్రమేనన్నారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో బీజేపీని బలోపేతం చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆరోపించారు.

 

మునుపటి వ్యాసం