నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు

ఐర్లాండ్ బౌలర్ క‌ర్టిస్ కాంఫ‌ర్‌ అరుదైన రికార్డు

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ క్వాలిఫ‌యింగ్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు నెదర్లాండ్, ఐర్లాండ్ జట్లు పోటీపడ్డాయి. అయితే బౌలింగ్ లో ఐర్లాండ్ విజృంభించింది. నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టును 20 ఓవర్లలో కేవలం 106 పరుగులకే ఆలౌట్ చేసింది. ఐర్లాండ్ ఫాస్ట్ బౌల‌ర్ క‌ర్టిస్ కాంఫ‌ర్‌ అరుదైన రికార్డు నెలకోల్పాడు. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.

ఇన్నింగ్స్ ప‌దో ఓవ‌ర్లో బౌలింగ్ వేసిన అతను నెద‌ర్లాండ్స్ బ్యాటర్లు కొలిన్ అకెర్‌మాన్‌, రియాన్ టెన్ డూషె, స్కాట్ ఎడ్వ‌ర్డ్స్‌, రోలోఫ్ వాండెర్ మెర్వ్‌ల‌ను వ‌రుస బంతుల్లో అవుట్ చేశాడు. దాంతో అంత‌ర్జాతీయ‌ టీ20 క్రికెట్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా క‌ర్టిస్ నిలిచాడు.

ఇంత‌కుముందు శ్రీలంక పేస‌ర్ ల‌సిత్ మ‌లింగా, ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ ఈ అరుదైన రికార్డు సాధించారు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ జట్టు మెక్స్ ఓ డౌడ్ 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక మిగితా బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేదు. చివర్లో కెప్టెన్ సిలార్ 21 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేయడంతో ఆ మాత్రం స్కోర్ అయినా నెదర్లాండ్స్ చేయగలిగింది.

మునుపటి వ్యాసం