తెలంగాణ రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా సోమవారం ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 20వ తేదీన అశ్వయుజ పౌర్ణమినాడు వాల్మీకి జయంతిగా జరపనున్నారు.ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్టర్లు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను అన్ని జిల్లాల్లోనూ కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాలకు అయ్యే ఖర్చులను బీసీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ తన బడ్జెట్‌లో కేటాయిస్తుందని తెలిపారు. 

మునుపటి వ్యాసం