కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్

30 రోజుల వేతనాలకు సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్

న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. దీపావళి పండుగ సందర్భంగా గ్రూప్‌ సీలోని ఉద్యోగులకు, గ్రూపు ‘బీ’లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి 30 రోజుల వేతనాలకు సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(అడ్-హాక్ బోనస్)ను గ్రూప్ ‘సీ’లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు ‘బి’లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

వీరు ఎలాంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీం కింద కవర్ కారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ తాత్కాలిక బోనస్ సెంట్రల్ పారా మిలటరీ దళాలు, సాయుధ దళాలలో అర్హులైన ఉద్యోగులకు కూడా లభిస్తుందని పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన ఉద్యోగులకు ఈ బోనస్ లభించనుంది. ఈ మేరకు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మునుపటి వ్యాసం