ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు

ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య ప‌రిస‌రాల‌ను పరిశీలించిన సీఎం

యాదాద్రి భువ‌న‌గిరి: యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. బాలాల‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంత‌రం కేసీఆర్ ను వేద పండితులు ఆశీర్వ‌దించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం యాదాద్రికి చేరుకున్న కేసీఆర్  ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు.

ఆ త‌ర్వాత కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా కొండ‌పైకి చేరుకున్నారు. పూర్తి కావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్రమంలో ఇవాళ ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని కేసీఆర్  ప్రకటిస్తారు. కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి, మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, గ్యాద‌రి కిశోర్, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, టిఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు తదితరులు ఉన్నారు.