అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్తుంటే ఆపడానికి మనం ఎవరం?

అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ముస్లిం సోదరులు నేడు మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బుర్కా వేసుకోని అమ్మాయితో ముస్లిం అబ్బాయి తిరిగితే పట్టించుకోరు. బుర్కా వేసుకున్న అమ్మాయి మరొకరితో కనిపిస్తే దాడి చేస్తారు.

అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్తుంటే ఆపడానికి మనం ఎవరం?’’ అంటూ అసదుద్దీన్‌ ప్రశ్నించారు. అంతేకాకుండా మగాడికో న్యాయం? ఆడవాళ్లకో న్యాయమా?. ముస్లిం అబ్బాయ్‌ ఎవరితోనైనా తిరగొచ్చా? ముస్లిం అమ్మాయి మాత్రం అలా కనిపించకూడదా అంటూ వ్యాఖ్యానించారు. ఇది 1969 కాదు. 2021 కాలానికి తగ్గట్టుగా మారక తప్పదని వ్యాఖ్యానించారు.

మునుపటి వ్యాసం