ఒడిదుడుకుల మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్ సర్వ్ వంటి కంపెనీల అండతో మళ్లీ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 62,250 వరకు ఎగబాకింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో చివరకు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 61,716కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 18,418 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: టెక్ మహీంద్రా (4.12%), ఎల్ అండ్ టీ (3.26%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.99%), ఇన్ఫోసిస్ (1.63%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.13%). టాప్ లూజర్స్: ఐటీసీ (-6.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (-4.06%), టైటాన్ కంపెనీ (-3.97%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.73%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.60%).

మునుపటి వ్యాసం