‘మా’పై మరోసారి కామెంట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

సామాజిక మాధ్యమాల్లో వైరల్

హైదరాబాద్ : ప్రముఖ విమర్శకుడు, సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపుడు ఎవరినీ ఆకాశానికి ఎత్తేస్తాడో ఎప్పుడు ఎవరినీ ఏ రకంగా విమర్శిస్తాడో ఆయనకే తెలియదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాడు ఆర్జీవీ. తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) వివాదంపై తనదైన స్టైల్లో స్పందించాడు. మా అసోసియేషన్ సర్కస్ అని.. రెండు రోజుల కింద ట్వీట్ చేసిన ఆర్జీవీ, తాజాగా మరోసారి మా వివాదంపై వివాదాస్పద కామెంట్‌ చేశాడు.

సిని'మా' ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఓటమి పాలైంది. 

 

మునుపటి వ్యాసం