ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న హైదరాబాద్ యువతులు

కిషన్ రెడ్డి చొరవతో సురక్షితంగా బయటకు వచ్చిన యువతులు

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడ్రోజుల నుంచి ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్  రాష్ట్రంలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.

ఈ నేపథ్యంలో నలుగురు హైదరాబాద్ యువతులు ఇక్కడి వరదల్లో చిక్కుకున్నారు. వారు ఉంటున్న భవనాన్ని వరద చుట్టుముట్టడంతో వారు భవనంపైకి చేరారు. ఆ యువతులు గత మూడ్రోజులుగా భవనంపైనే ఉంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి, అధికారులను అప్రమత్తం చేశారు.

కిషన్ రెడ్డి బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మంత్రి ఆదేశాలతో సహాయచర్యలు వేగవంతం చేశారు. రెస్క్యూ బృందం ఎంతో శ్రమించి ఆ నలుగురు హైదరాబాద్ యువతులను కాపాడింది. అనంతరం వారిని దిల్లీకి తరలించారు.

మునుపటి వ్యాసం