హిందూవులు, ముస్లింలు దేశానికి రెండు కళ్లు

ఎంపీ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: హిందూవులు, ముస్లింలు దేశానికి రెండు కళ్లని రాజీవ్‌ గాంధీ చెప్పారని టీపీసీసీ చీఫ్ గుర్తుచేశారు. మంగళవారం చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేడు అధికారం కోసం కొందరు రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పేదల కష్టసుఖాలు తెలుసుకునేందుకు రాజీవ్‌గాంధీ యాత్ర చేశారని అన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పారు.

మునుపటి వ్యాసం