ఈ నెల 29న మలయాళంలో ‘లవ్‌స్టోరీ’ విడుదల

మలయాళంలో ‘ప్రేమతీరం’గా ‘లవ్‌స్టోరీ’

తిరువనంతపురం: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం టాలీవుడ్ లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇందులో హీరో అక్కినేని నాగచైతన్య, నటి సాయి పల్లవి జంటగా నటించారు. టాలీవుడ్ లో విజయాన్నందుకున్న ఈ చిత్రాన్ని మలయాళంలో డబ్బింగ్ చేస్తున్నారు.

‘ప్రేమతీరం’ పేరుతో మలయాళంలో ‘లవ్‌స్టోరీ’ సినిమాను ఈ నెల 29న విడుదల కాబోతోంది. కేరళలో కులాంతర నేపథ్యం కలిగిన సినిమాలు తరుచూ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ‘లవ్‌స్టోరీ’ని ’ప్రేమతీరం‘ పేరిట విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే సాయి పల్లవి ’ప్రేమమ్‘ సినిమాతో మలయాళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ’ప్రేమమ్‘ సినిమా తెలుగు వెర్షన్ లో నాగచైతన్య హీరోగా నటించారు. మలయాళంలో ఈ సినిమాను ఇ4 మూవీస్ విడుదల చేస్తోంది. ఇక్కడ కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో నాగచైతన్య, సాయిపల్లవి ఉన్నారు. కాగా,  ‘లవ్‌స్టోరీ’లో శేఖర్ కమ్ముల కులవివక్షతపై చర్చించారు.

మునుపటి వ్యాసం