పచ్చి పసుపు తరుగుతో లడ్డూలు

కావలసిన పదార్థాలు, తయారీ విధానం

కావాల్సినవి: పచ్చి పసుపు తరుగు: 250 గ్రాములు, బెల్లం: 250 గ్రాములు, ఆవునెయ్యి: 4 టేబుల్‌ స్పూన్లు, బాదం, కాజు: 100 గ్రాములు, పుచ్చ పలుకులు: 50 గ్రాములు, కొబ్బరిపొడి: అర కప్పు, మిరియాలపొడి: అర టీస్పూన్‌, పొప్పడి పలుకులు: ఒక టీస్పూన్‌

తయారీ విధానం: కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి బాదం, కాజు, పుచ్చపలుకులు వేయించాలి. చల్లారాక మిక్సీపట్టి పొడి చేసుకోవాలి. అదే కడాయిలో పొప్పడి పలుకులు వేయించి పక్కన ఉంచుకోవాలి. మళ్లీ కడాయిలో ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి, పసుపు తరుగు వేసి అడుగున అంటుకోకుండా కలుపుతూ ఉండాలి.

బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోగిన్నెలో బెల్లం పాకం పట్టుకోవాలి. అందులో బాదం, కాజు, పుచ్చపలుకుల పొడి, పొప్పడి పలుకులు, కొబ్బరిపొడి, మిరియాలపొడి వేసి కలుపుకోవాలి. చివరగా పసుపు తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమం కాస్త చల్లబడిన తర్వాత లడ్డూలు కట్టుకుంటే సరి.