వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

రామాయణ మహా కావ్యం సృష్టికర్త ఆదికవి వాల్మీకి మహర్షి. వాల్మీకి రామాయణం చాలా పురాతన కావ్యం.

రామాయణ మహా కావ్యం సృష్టికర్త ఆదికవి వాల్మీకి మహర్షి. వాల్మీకి రామాయణం చాలా పురాతన కావ్యం. రామాయణం అంటే రాముడి కథ. అయితే వేటగాడిగా బతుకుతున్న వాల్మీకి రామాయణ మహాకావ్యం రచించే శక్తి ఏవిధంగా వచ్చిందో.. వేటగాడి నుంచి మహర్షిలా ఏవిధంగా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం. 

వాల్మీకి నిజానికి ఒక వేటగాడు. అడవులలో పక్షులను, జంతువులను వేటాడటంతోపాటు అడవిలో వెళ్లే వారిని దోచుకునేవాడు. ఒకరోజు అడవిలో వెళ్తున్న మునులను అడ్డగించి వారి వద్ద ధనం ఉంటే తనకు ఇవ్వమని బెదిరించాడు. తపస్సు చేసుకుంటూ ఉండే తమ వద్ద ఎటువంటి ధనం ఉండదని సమాధానం చెబుతారు ఆ మునులు. అయితే వేటాగాడిలో  మార్పు తీసుకురావాలనుకుంటున్నారు ఆ మునులు. అప్పుడు వాల్లీకితో వారు ఇలా అన్నారు.

"నువ్వు నీ కుటుంబం కోసం పాపాలు చేస్తున్నావు. నీ పాపాలలో నీ కుటుంబంలోని వారు ఎవరైనా భాగం పంచుకుంటారా? ఇంటికి వెళ్లి కనుక్కుని రా.. ఎవరైనా భాగం పంచుకుంటారు అంటే నువ్వు కోరినంత ధనాన్ని సృష్టించి ఇస్తామని" అన్నారు. వెంటనే ఇంటికి వెళ్లిన వాల్మీకి.. నా పాపాలలో భాగం పంచుకుంటావా అని భార్యను, పిల్లలను అడిగాడు. దీంతో వారు దానికి సమాధానం చెప్పలేదు. వెంటనే నిరాశగా తిరిగి మునుల దగ్గరకు వచ్చాడు. వారి కాళ్ల మీద పడి తన పాపాల నుంచి విముక్తి కలిగించే మార్గం చెప్పమని ప్రార్థించాడు. ఒకరోజు అడవిలో వేటకు వెళ్లి రెండు పక్షులు చూశాడు దానిలో ఒక పక్షిని చంపేశాడు. దీనితో రెండో పక్షి కన్నీరు కారుస్తూ మరణించింది. ఈ సంఘటనతో వాల్మీకిలో మార్పు వచ్చింది.

అప్పటి నుంచి వేటాడటం మానేసి తపస్సు చేసుకుంటూ జీవించసాగాడు. కొద్దికాలానికే ఆ మునులు తిరిగి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు వాల్మీకి తపస్సులో మునిగి ఉన్నాడు.  అతడి చుట్టూ పెద్ద పెద్ద పుట్టలు పెరిగి ఉన్నాయి. పుట్టలకే వాల్మీకం అనే పేరు ఉండేది. మునుల రాకను గమనించి ఆ పుట్టలో నుంచి బయటకు వచ్చిన అతడికి వాల్మీకి అనే పేరు పెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అడవిలో ప్రజల పెద్దగా ఉండి మంచి పనులు చేయమని వారికి బోధించేవాడు. ఒకరోజు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై రాముని కథను కథగా రాయమని ఆదేశించారు. రామాయణం రాయడం అదృష్టంగా భావించిన వాల్మీకి, కథలు రాయడంలో మునిగిపోయాడు. ఒకనాడు ఆయన ఆశ్రమం సమీపంలో ఒక యువతి విచారంగా ఉండడాన్ని చూశారు ఆశ్రమంలోని బాలురులు. ఆమె సీతాదేవి.

వాల్మీకికి ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్లి ఆమెను కలుసుకుంటారు. రాజ్యంలో ఒకరన్న మాటను విని తనను రాముడు అడవులలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడని చెప్పింది సీతాదేవి. సీతాదేవిని తనతో ఆశ్రమానికి తీసుకు వస్తాడు వాల్మీకి. ఆశ్రమంలో ఉన్న సమయంలోనే దేవికి ఇద్దరు కవలలు జన్మిస్తారు. వాల్మీకి వారికి లవుడు, కుశుడు అనే పేరు పెట్టి విద్యాబుద్ధులు నేర్పిస్తారు.

రాముడు అశ్వమేధయాగం చేసినప్పుడు ఒక గుర్రాన్ని ఆ రోజంతా వదులుతారు యాగం చేస్తున్న రాజుని ఎదుర్కోవాలి అనుకుంటే ఆ గుర్రాన్ని కట్టేస్తారు అప్పుడు యాగం చేస్తున్న రాజు కట్టేసిన వారితో యుద్ధం చేసి గెలవవలసి ఉంటుంది. లవకువులు ఆ యాగాశ్వాన్ని బంధిస్తారు యుద్ధం చేయడానికి రాముడు వచ్చినప్పుడు అతడికి నిజం తెలుస్తుంది. వాల్మీకి సీతాదేవి, లవకుశులను రాముడికి అప్పగిస్తారు. సీతాదేవి రాముడి వద్దకు కాక తన తల్లి భూదేవి వద్దకు వెళ్తానని వాల్మీకి చెబుతుంది. తమతో పాటు తమ లోకానికి సీతాదేవిని తీసుకువెళుతుంది భూదేవి. రావణాసురుడిని  సంహరించిన తర్వాత కథలో తన పాత్రగా వాల్మీకి ఆ కథను మనకు అందించాడు.  

మునుపటి వ్యాసం