దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న రజినీకాంత్

ఉపరాష్ట్రపతి వెంకయ్య చేతుల మీదుగా ప్రదానం

న్యూదిల్లీ: చిత్ర పరిశ్రమలో అత్యున్నతంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు విశిష్ట ఈ పురస్కారం వరించింది. చిత్రపరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన అందుకున్నారు.

ఉత్తమ నటుడి పురస్కారాన్ని హిందీ నటుడు మనోజ్ భాజ్‌పాయ్ (భోంస్లే చిత్రం), తమిళ హీరో ధనుష్ (అసురన్) అందుకున్నారు. ‘మణికర్ణిక’ చిత్రానికి కంగనా రనౌత్‌ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు, తెలుగులో ‘జెర్సీ’, ‘మహర్షి’ చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైన మహర్షి మూవీకి గానూ నిర్మాత దిల్ రాజు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఆ  సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లికి స్వర్ణ కమలం దక్కింది.   

మునుపటి వ్యాసం