వారానికి యాభై వేల మంది మృతి

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్‌ అథనామ్‌

బెర్లిన్: సమర్థవంతమైన ప్రజారోగ్య సాధనాలు, సమర్థవంతమైన వైద్య సాధనాలు మన దగ్గర ఉన్నాయి. కానీ ప్రపంచం ఆ సాధనాలను సరిగ్గా వినియోగించడం లేదని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారానికి దాదాపుగా 50 వేల మంది చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో అథనామ్ మాట్లాడుతూ..' ప్రపంచం కరోనాను అంతం చేయాలనుకున్నప్పుడే మహమ్మారి కనుమరుగౌతుంది. అది మన చేతుల్లో ఉంది.

మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు` అని అన్నారు. ప్రజారోగ్య సాధనాలను సమర్ధవంతంగా ఉపయోగించాల్సిన అవరముందని  కోవాక్స్‌ మెకానిజం, ఆఫ్రికన్‌ వాక్సిన్‌ ట్రస్ట్‌ (ఎవిఎటి)లో చురుగ్గా పాల్గొనేందుకు జి 20 దేశాలు తమ జనాభాలో 40 శాతం మందికి వ్యాక్సిన్లు అందించాలని కోరారు.

డబ్ల్యుహెచ్‌ఒ వెబ్‌సైట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని ప్రతి దేశానికి కోవిడ్‌-19 పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు సమానమైన ప్రాధాన్యత కల్పించడం, అభివృద్ధి, ఉత్పత్తిని వేగవంతం చేయడమే కోవాక్స్‌, యాక్ట్‌ లక్ష్యమని పేర్కొంది. ప్రపంచ దేశాలకు అందించేందుకు 8 బిలియన్ల కోవిడ్‌-19 వ్యాక్సిన్లను సేకరించేం దుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జి-20 దేశాలకు ఐరాస జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ పిలుపునిచ్చిన తర్వాత అథనామ్‌ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

మునుపటి వ్యాసం