హిమాచల్ ప్రదేశ్ లో ముగ్గురు పర్వతారోహకుల మృతి

10 మందిని సురక్షితంగా కాపాడగలిగిన ఐటిబిపి అధికారులు

న్యూదిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రెక్కింగ్‌కి వెళ్లిన ముగ్గురు పర్వతారోహకులు మంచు తుఫానులో చిక్కుకుని మృతి చెందారు. ట్రెక్కర్ల బృందంలోని 13 మందిలో 12 మంది మహారాష్ట్రకు చెందినవారు కాగా, ఒకరు మాత్రం పశ్చిమబెంగాల్‌కి చెందినవారని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఇండో టిబిటెన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబిపి) అధికారులు ప్రకటించారు. 

ఈ పదమూడు మందిలో ముగ్గురు మృతి చెందగా 10 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. వీరంతా అక్టోబర్‌ 17న కిన్నౌర్‌ జిల్లాలోని రోహ్రు నుండి బురువా గ్రామానికి తమ యాత్రను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మంచు కురుస్తున్న కారణంగా బురువా కందా ఎగువ ప్రాంతంలో వారంతా చిక్కుకుపోయారు. 

ఈ మేరకు సమాచారమందుకున్న ఐటిబిపి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 15000 అడుగుల వద్ద మూడు మృతదేహాలు పడి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, చనిపోయిన ముగ్గురు రాజేంద్ర పాఠక్‌, అశోక్‌ భలేరావు, దీపక్‌ రావుగా అధికారులు గుర్తించారు. ఇటీవల ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతశ్రేణుల్లో తప్పిపోయిన 12 మంది పర్వతారోహకులు మృతి చెందిన విషయం తెలిసిందే. 

 

 

మునుపటి వ్యాసం